నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్ : ప్రతిపాదిత బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నేడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు. ఆర్థిక సంస్కరణల ప్రక్రియలో భాగంగా బ్యాంకుల విలీనం, ప్రైవేటు బ్యాంకులను ప్రోత్సహించే చర్యలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా 27 ప్రభుత్వరంగ బ్యాంకులు, 12 పాతతరం బ్యాంకు ప్రైవేటు బ్యాంకులకు చెందిన ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలో సుమారు 5 వేల కోట్ల లావాదేవీలు స్తంభించనున్నాయి.