నేడు వికలాంగుల గుర్తింపు శిబిరం

సంగారెడ్డి, జూలై 19 : సంగారెడ్డి రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి వికలాంగులలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, పెద్దలు గుర్తింపు శిబిరం ఈ నెల 20వ తేదీన పాత డిఆర్‌డిఎ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ పిడి లక్ష్మణాచారి తెలిపారు. ఉదయం 10గంటల నుంచి 5గంటల వరకు శిబిరం ఉంటుందని తెలిపారు. వినికిడిలోపం ఉన్నవారు. చలనలోపం, అంగవైకల్యం కలవారు కాలు లేదా చేతి లేని వారికి కృతిమ అవయవాలను అమర్చడానికి కొలతలు తీసుకొని వారికి 3నెలల లోపు అందజేస్తామని తెలిపారు. నడవలేని స్థితికల వారికి ట్రైసైకిళ్లు, చెతికర్రలు, ఇవ్వనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి డివిజన్‌ లోని సంగారెడ్డి, కొండాపూర్‌, సదాశివపేట, పటాన్‌చెరువు, రామచంద్రాపురం, రాయికోడ్‌, కోహీర్‌, జహిరాబాద్‌, మనూర్‌ మండలాల వారు పాస్‌సైజ్‌ ఫోటోలతో హాజరు కావాలని కోరారు.