నేడు షార్‌కు రాష్ట్రపతి రాక
నెల్లూరు: పీఎన్‌ఎల్‌వీ-సి20 ప్రయోగాన్ని వీక్షించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు నెల్లూరులోని షార్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి చెన్నైకి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీహరికోటకు వస్తారు. సాయంత్రం 5.30కు ప్రయోగాన్ని వీక్షించి రాత్రికి షార్‌లోనే బస చేస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు చెన్నైకు బయలుదేరి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు.