నేడు స్వాతంత్య సమరయోధులపై ఫొటో ఎగ్జిబిషన్‌

share on facebook

మూడురోజులు సాగనున్న ప్రదర్శన
కామారెడ్డి,ఆగస్టు 25(జనంసాక్షి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్‌ స్టాండు ప్రాంగణంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఫీల్డ్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరో, నిజామాబాదు యూనిట్‌ ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీ నుంచి మూడు రోజులపాటు స్వాతంత్య సమరయోధులపై నిర్వహించనున్న ఫొటో ఎగ్జిబిషన్‌ను గురువారం 26న ఉదయం 10 గంటలకు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ ప్రారంభించనున్నట్లు నిజామాబాదు ఫీల్డ్‌ పబ్లిసిటీ అధికారి కే.శ్రీనివాసరావు నేడొక ప్రకటనలో తెలిపారు. భారత స్వాతంత్య 75 వార్షికోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీకా అమత్‌ మహా ఉత్సవ్‌ కార్యక్రమలో భాగంగా ఫొటో ఎక్జిబిషన్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత స్వాతంత్య సమరంలో పోరాడిన అప్పటి హైదరాబాద్‌ సంస్థానంలో నిజాంపాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ స్వాతంత్ర యోధుల కషిని క్లుప్తంగా వివరించడం, వారి త్యాగాలను ప్రస్తుత తరానికి తెలియచెప్పి వారిలో స్పూర్తిని కలిగించడమే ఈ ఫోటో ఎక్జిబిషన్‌ లక్ష్యమన్నారు. ఎక్జిబిషన్‌లో కుమరం భీమ్‌, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్ధ,
అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు తదితరుల పాత్రను ప్రస్తుత తరానికి క్లుప్తంగా వివరిస్తారని ఆయన తెలిపారు.

Other News

Comments are closed.