నేడు హావేరిలో యడ్యూరప్ప బహిరంగ సభ

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. భాజపా నుంచి వేరుకుంపటి పెట్టిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆదివారం తన బలాన్ని ప్రదర్శించనున్నారు. ఇందుకు రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న హావేరి పట్టణం వేదిక కానుంది. యడ్యూరప్ప స్థాపించిన కర్ణాటక జనతాపార్టీ తొలి సమావేశాన్ని ప్రతిష్టాత్మంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కనీసం ఐదు లక్షల మందిని సమీకరించి సత్తా చాటాలన్నది యడ్యూరప్ప వ్యూహం.

తాజావార్తలు