నేదురుమల్లి, మంత్రి బాలారాజులను పరామర్శించిన సీఎం

హైదరాబాద్‌ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్‌ రెడ్డి, మంత్రి బాలరాజును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో మూడు రోజుల క్రితం నేదురుమల్లి నిమ్స్‌లో చేరగా, మంత్రి బాలారాజు కాలు విరగడంతో పది రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.