నోవాటెల్ వద్ద తెలంగాణ లాయర్లు అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని నోవాటెల్ హూటల్ వద్ద తెలంగాణ న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ మార్చ్‌పై వివరణ ఇచ్చేందుకు హూటల్‌లోకి అనుమతి ఇవ్వాలని పోలీసులను వారు కోరారు. అందుకు పోలీసులు నిరాకిరించారు. పోలీసుల వలయాన్ని చేధించుకుని న్యాయవాదులు హూటల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు పరిసర ప్రాంతాల్లో తెలంగాణ మార్చ్ నిర్వహించాలని న్యాయవాదులు కోరినట్లు సమాచారం.



