న్యూజిలాండ్‌తో సీరీస్‌ గెలుస్తాం: కెప్టెన్‌ ధోని

హైదరాబాద్‌: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రీడా మైదానంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యూజిలాండ్‌తో సీరీస్‌ గెలుస్తామని భారత క్రికెట్‌జట్టు కెప్టెన్‌ ధోని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్‌, లక్ష్మణ్‌, హర్భజన్‌వంటి క్రిడాకురులు లేకపోవటం లోటేనని అయినా యుక క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇదో అవకాశం అని ఆయన అన్నారు. ఎర్రమట్టి నేలలపై స్పన్‌బౌలింగ్‌ భారత జట్టుకు అనుకూలిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేపటి ఆటలో ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంటే యువ క్రీడాకారులకు సదవకాశంగా భావిస్తామన్నారు.