న్యూయార్క్‌లో తొలి త్రైపాక్షిక చర్చలు

వాషింగ్టస్‌: అమెరికా, భారత్‌, ఆప్ఘనిస్థాన్‌ల మధ్య తొలిసారిగా త్రైపాక్షిక చర్చలు న్యూయార్క్‌లో జరగనున్నాయి. సమితి సాధారణ సభ ఆరవ వార్షికసమావేశం జరిగేటప్పుడే మరో పక్క ఈ చర్చలను నిర్వహించనున్నారు. డిప్యూటీ ఫారిన్‌ మినిస్టర్‌ స్థాయిలో ఈ చర్చలు జరుగుతాయని దౌత్య వర్గాలు తెలియజేశారు.