పండగపూట విషాదం

సంతోష్‌ నగర్‌లో ఒకే కుంటుంబానికి చెందిన
ఐదుగురి ఆత్మహత్య
హైదరాబాద్‌,అక్టోబర్‌ 22(జనంసాక్షి) : హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లో విషాదకర సం ఘటన చోటు చేసుకుంది.. పండగా పూట ఆనందంగా గడపాల్సిన కుటుంబం మూగ బోయింది… దసరా సెలవులతో కేరింతలు కొడుతూ ఆడే ఆ పిల్లలు శాశ్వతంగా సెలవు తీసుకుని ఈ లోకాన్ని విడిచి తిరిగిరాని లోకానికి వెళ్లారు… పండగతో ప్రతి ఇంట్లో ఆనందాల పందిర్లు వెలిసాయి కాని వీరి వాకిట్లో మాత్రం విషాదచాయాలు నెలకొన్నాయి. ఆర్థిక సమస్యలతో నలిగిపోయి ఆ కుటుంబం ఈ లోకానికే దూరమైంది… ఆర్థిక సమస్యలతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య పాల్పడ్డారు. సంతోష్‌నగర్‌లో నివాసముంటున్న సఖ్‌వీర్‌గౌడ్‌ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో సుఖ్‌వీర్‌గౌడ్‌ అతని భార్య మంజూల, కుమార్తెలు దుర్గా మల్లేశ్‌, శృతి, సృజనలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సఖ్‌వీర్‌ గౌడ్‌ దంపతులు తొలుత ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, మరో పాపతో కలిసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై సంతోష్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.