పక్షపాత వైఖరి ప్రదర్శించిన పోలీసులు

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వివక్ష చూపుతున్నారని అపార్టీ ఎమ్మెల్యే హరీష్‌ రావు ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం రాచమర్యాదలు చేశారని విమర్శించారు. పోలీసుల పక్షపాత వైఖరిపై శాసనసభ స్పీకర్‌, మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు హరీష్‌ రావు తెలిపారు. అలాగే నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.