పట్టణం పలు వార్డులో ఘనంగా ప్రారంభమైన హాత్ సే హాత్ జోడో యాత్ర
పాల్గొన్న డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
9,25,మరియు 26 వ వార్డులలో హాత్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో* ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి ఎన్నికలలో పబ్బం గడుపుతున్నారని *పేదలకు ఇల్లు కట్టిస్తానని 3016 పెన్షన్ ఇస్తానని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని మహిళలకు రుణాలు మాఫీ చేస్తాను రైతులకు ఉచిత కరెంటు 24 గంటలు ఇస్తానని రైతులకు రుణమాఫీ చేస్తానని అనేక రకమైనటువంటి మోసపూరిత హామీలను ఇచ్చి 9 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ ప్రజల పైన కపట ప్రేమ కనబరుస్తు లబ్ది పొందాలని చూస్తున్నారని ప్రజలు మోసపోవద్దని అన్నారు.
ప్రథాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని మోదీ ఇద్దరు కలిసి దొంగ దొంగ రాష్ట్ర దేశ ప్రజలను మోసం చేస్తూ పబ్బం* గడుపుకుంటున్నారని రాష్ట్రంలో కేసీఆర్ ఎన్నికల హామీలు దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టును కాలేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి లక్ష కోట్ల రూపాయలను దోచుకున్నారని దళితుల భూములను లాక్కొని భూ దందాలు చేసి కెసిఆర్ కుటుంబ లబ్ధి పొందుతుందని బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తూ మానవతా విలువలను మంట కలుపుతూ ప్రజాప్రతినిధులను ప్రజలను అగౌరపరుస్తూ దొరల పాలన కొనసాగిస్తున్నారని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి ప్రజా *ప్రతినిధులను ప్రభుత్వ అధికారులను ప్రతి ఒక్కరిని కూడా అణగదొక్కే విధంగా పాలన కొనసాగిస్తున్నారని కాబట్టి రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మద్దతు తెలపాల్సిన ఆవశ్యకత ఉన్నదని ప్రజలు ఆలోచన చేయాలని ఈ సందర్భంగాపిలుపునిచ్చారు
ఇట్టి కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ ,సత్యనారాయణ ,ప్రమోద్ కుమార్ ,తగాలపల్లి రవికుమార్ బేండేలాల్ రాజ్ చల్ల గురుగు్ల రఘుబాబు, సల్లావుద్దీన్ కూర వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు జడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచులు యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యూ ఐ మహిళా కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.