పడిపోయిన బంగారం ధరలు ప్రస్తుతం

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పతనాన్ని నమోదు చేశాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుదల దీర్ఘకాలంగా కొనసాగవచ్చన్న అంచనాల మధ్య అంతర్జాతీ మార్కెట్‌లో పసిడి ధరలు పడిపోయాయి.

దీంతో వరుసగా నాల్గో వారంలో కూడా దిగి వచ్చింది. (గోల్డ్‌ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!)

ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ తదుపరి రివ్యూలో కూడా వడ్డీ రేటు పెంపుదల ముందుకు సాగవచ్చని అంచనా. అలాగే తాజా డేటా ప్రకారం నిరుద్యోగ ప్రయోజనాల కోసం కొత్త క్లెయిమ్‌లను దాఖలు చేసే అమెరికన్ల సంఖ్య గత వారం పడిపోయింది. దీంతో లేబర్ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగవచ్చని మరో అంచనా. అమెరికా 10-సంవత్సరాల ట్రెజరీ నోట్‌పై దిగుబడి ఆగస్ట్‌లో 4.2శాతం మార్కు కంటే పెరిగింది, 2007లో చివరిసారిగా ఈ స్థాయికిచేరింది.

ఔన్స్‌ ధర 1918 డాలర్లకు పడిపోయిన బంగారం ధరలు ప్రస్తుతం 0.16 శాతం పెరిగి 1,919 డాలర్లు ట్రేడవుతున్నాయి, అటు సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగాపెరిగాయి.
దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా లాభపడుతున్నాయి. రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం పుత్తడి రూ.59,170 వద్ద కొనసాగుతున్నాయి.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.54,150 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.59,070 పలుకుతోంది. వెండి కిలోధర 76,500 వద్ద కొనసాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

రూపాయి
అమెరికా డాలరుతో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి నుండి కోలుకుంది. సోమవారం 5 పైసలు పెరిగి 83.05 వద్ద ట్రేడ్‌ అయింది. ప్రస్తుతం 88.09 వద్ద కొనసాగుతోంది. అటు ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.73శాతం పెరిగి 85.42 డాలర్ల వద్దకు చేరుకుంది.

D