పదవీ విరమణ పొందిన మహమ్మద్ ఫరూక్ కి ఘనంగా సన్మానం
మెట్పల్లి టౌన్,మే 03, జనంసాక్షి :జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సబ్ అర్డి నెట్ గా విధులు నిర్వహించిన మహమ్మద్ ఫరూక్ సోమవారం నాడు పదవి విరమణ పొందిన సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని వారి నివాసంలో మెట్ పల్లి పట్టణ 9వ వార్డు కౌన్సిలర్ మొరపు గంగాధర్, మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, కో ఆప్షన్ మెంబర్ మార్గం గంగాధర్ లు బుధవారం రోజున మహమ్మద్ ఫరూక్ కు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానిచడం జరగింది ఈ కార్య క్రమం లో 9వ వార్డు ఇంఛార్జి మోరపు తేజ, సల్మాన్ వార్డు సభ్యులు పాల్గొనడం జరగింది