పదవ తరగతి విద్యార్థులకు అభ్యాస కరదీపికలు

వేములవాడ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) :
వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న అభ్యాస కరదీపికలను శనివారం మండల విద్యాధికారి బన్నాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షకు ప్రణాళిక ప్రకారం సంసిద్ధులు కావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిఆర్పిలు రాజు, నగేష్ తదితరులు పాల్గొన్నారు..