పదవ తరగతి విద్యార్థుల ప్రేమ తరగతులు ప్రారంభం
పదవ తరగతి విద్యార్థుల ప్రేమ తరగతులు ప్రారంభం
గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 24 (జనం సాక్షి);
పదవ తరగతి విద్యార్థుల ప్రేరణ తరగతుల కార్యక్రమము
జోగుళాంబ గద్వాల జిల్లా యందు 2022-23 విద్యా సంవత్సరమునకు సంబంచిన 10 వ తరగతి
యస్సీ,యస్టీ,బీసీ వసతి గృహముల విద్యార్థులకు స్థానిక పాత మండల
కార్యాలయము నందు గల సమావేశ మందిరములో ప్రేరణ తరగతులు నిర్వహించారు.
సమావేశమునకు ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలక్టర్, అపూర్వ చౌహన్
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యకముము ప్రారంభించారు. తదుపరి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వనైనది .
ఇట్టి ప్రేరణ కార్యక్రములో పాల్గొన్న (500) మంది విద్యార్థులకు ఉత్తమ ఉపాద్యాయులచే సంబడిత సబ్జెక్ట్ లచే
ఉత్తమ మార్కులు సాదిచుటకు మార్గ నిర్దేశం ఇవ్వడం జరిగినది. 10 వ తరగతి నందు నూరు శాతం ఉత్తీర్ణత సాదించ వలసినదిగా విద్యార్థులకు సూచించడం జరిగినది. వసతి గృహ అధికారులు కూడ విద్యార్థులకు తగు
సూచనలు, సలహాలు ఇస్తూ వారికి అందుబాటులో ఉంటూ 100% ఉత్తీర్ణత సాధించవలసినదిగా ఆదేశించడం జరిగినది. ఈ కార్యక్రములో జిల్లా షెడ్యుల్డ్ కులముల అభివృద్ధి అధికారి యం. శ్వేతా ప్రియదర్శిని,బి. సరోజ, సహాయ సంక్షేమ అధికారి. యస్సీ,యస్టీ,బీసీ వసతి గృహముల
అధికారులు పాల్గొన్నారు.