పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్
అభివృద్దె మా లక్ష్యం డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మార్చి 21 :-. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా అన్నారు మంగళవారం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ ప్రాంతంలో గల సంతోష్ నగర్ సాయిబాబా దేవస్థానం గల్లీలో కాలనీవాసుల సొంత నిధులతో డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా సహకారంతో రెండు లక్షల నిధులతో 80 మీటర్ల పొడవైన యు జి డి పైప్ లైన్ పనులను కాలనీవాసులతో కలిసి డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి గాఈ కార్యక్రమంలో మల్లారెడ్డి జవహర్ నగర్ ప్రజలు నా గుండెకాయ లాంటి వారు అని నిత్యం చెపుతున్న విధంగానే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకోసం అనేకమైన నిధులను కేటాయిస్తూ ఎంతగానో కృషి చేస్తున్నారని ఇకముందు కూడా మంత్రి సహకారంతో మరిన్ని నిధులు కేటాయించి కార్పొరేషన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతామని అన్నారు ఈ కార్యక్రమంలో స్వామి, భారతి, బాలు, శశికళ, లక్ష్మీ ప్రియా, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.