పరవాడలో చెలరేగిన ఘర్షణ
పరవాడ: విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలంపాలెంలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగాల కేటాయింపుల్లో వివక్ష పాటిస్తున్నారని తెదేపా, కాంగ్రెస్, వైకాపాకు చెందిన మత్స్యకారులు పరస్పరం దాడులకు దిగారు. రెండు రోజులుగా ఈ ఘర్షణలు గ్రామంలో కొనసాగుతున్నాయి. ఈ రోజు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పలువురిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే అక్కడ కూడా ఆందోళనకారులు గొడవకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.