పరిశుభ్రత పాటించడం అందరి బాధ్యత జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

వేములవాడ రూరల్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : ప్రతి ఒక్క ఇంటిలో మరుగుదొడ్లు నిర్మించుకొని, పరిసరాల పరిశుభ్రంగా ఉంచుతూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ సూచించారు. వందశాతం మరుగుదొడ్లను నిర్మించుకున్న గ్రామం లో రోడ్లు, మురికి కాలువల నిర్మాణంకోసం జిల్లా పరిషత్‌, మం డల పరిషత్‌ నిధులను కేటాయించి త్వరితగతిన పనులను పూర్తి చేసేలా చూస్తామన్నారు. వేములవాడ సినారే కళామందిరంలో శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి అధికారులతో ఐఎస్‌ఎల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేములవాడ మండలంలో చేపట్టిన మరుగుదొడ్లలో వందశాతం నిర్మాణాలు పూర్తి కావాలంటే ఇంకా 747 మరుగుదొడ్లను నిర్మిం చాల్సి ఉందని, ఆగస్టు 15 తేదీలోగా గ్రామస్థులకు అవగాహన కల్పించి ఈ నిర్మాణాలను చేపట్టుకునేలా చూసి, నిర్మల్‌ గ్రామపురస్కారాన్ని అందుకోవాలన్నారు. సిరిసిల్లా, వేములవాడ మండలాలోని అన్ని గ్రామాలతో పాటు ఇతర 7 గ్రామాలలో ఈ నిర్మాణాల పనులను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

సిరిసిల్ల మండలంలో 4వేల నిర్మాణాలను పూర్తి చేయాల్సిఉందని ఈ నిర్మాణా లను ఆగష్టు 20వ తేదీవరకు పూర్తిచేసి నిర్మల్‌ పురస్కారాన్ని అం దుకునేలా ప్రతిఅధికారికృషిచేయాలన్నారు. మరుగుదొడ్డి నిర్మాణం వలన కలిగే ప్రయోజనాలు వివరించడమే కాకుండా ‘మరుగుదొడ్డి నిర్మాణంలేనివారికి ఆడపిల్లను ఇవ్వం’ అని ప్రతిఒక్కరూ నిర్ణయా నికివచ్చి ఈ నిర్మాణం చేపట్టేలా చూడాలన్నారు. అలాగే ప్రతి ఇంటిలో మొక్కలను పెంచేవిధంగా చూడటంతో ఇంటివారికి ఉ పాధి లభించడమేకాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని, మొక్కల పెంపకానికి విత్తనాలను అందజేస్తామని పేర్కొన్నారు.  ఈ మండ లంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం పూర్తిచేసే దిశగా కృషిచేస్తున్న ఎంపిడిఓ.మచ్చగీత పనిని అభినందించారు. అలాగే సంకెపల్లి గ్రామంలో మరుగుదొడ్డిని నిర్మించుకున్న నీల య్య-సరస్వతి దంపతులకు కలెక్టర్‌ నీటిడ్రంబును అందజేశారు. అనంతరం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికి కృషిచే స్తున్న అధికారులకు ఆమె ప్రోత్సాకాలను అందజేశారు. ఈ కార్య క్రమంలో జగిత్యాల ఆర్డీఓ హన్మంతరెడ్డి, సిరిసిల్లా ఆర్డీఓ సునంద, ఎస్‌ఈ.శ్రీనివాస్‌రెడ్డి, వేములవాడ ఎంపిడిఓ మచ్చగీత, తహశీ ల్దార్‌ రామకృష్ణారెడ్డి,  ఎంఈఓ.రాజేంద్రశర్మ, ఏఓ.కృష్ణ, పశువైద్యాధికారి ప్రశాంత్‌, సాక్షర భారతి కో-ఆర్డీనేటర్లు, విఆర్‌ఓలు, కార్యదర్శులు, పీల్డ్‌ అసిస్టెంట్లు, ఐకెపి సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్సు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.