పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి.
బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్. పోటో: సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 7, (జనంసాక్షి)
గురుకుల పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ గురుకుల్ వచనోత్సవం పాల్గొని మాట్లాడారు. గురుకుల పాఠశాల ఆవరణలో ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని, వర్షాకాలం విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. ఈకార్యక్రమంలో డిజిటల్ మంచిర్యాల ఆప్ సీఈఓ, పాఠశాల ప్రిన్సిపాల్ సైదులు, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.