పలు ప్యాసింజర్‌ రైళ్ల రద్దు

గూడూరు: నెల్లూరులో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైటు ప్రమాదానికి గురి కావడంతో గూడూరు మీదుగా రాకపోకలు సాగించే ప్యాసింజర్‌ రైళ్లును అధికారులు సోమవారం పూర్తిగా రద్దు చేశారు. గుంటూరు నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ప్యాసింజర్‌ రైలు ఉదయం 9.15 నిమిషాలకు రావాల్సి ఉండగా మధ్యాహ్నం మూడు గంటలకు గూడూరుకు చేరింది. కేరళ, దరంతో ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒకటిన్నర గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్‌లో నిలిపేశారు. తిరుపతి నుంచి వచ్చే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ నుంచి చెన్నైకు వెళ్లే పినాకిని, చెన్నెయ్‌ నుంచి విజయవాడకు వెళ్లే జనశతాబ్డి రైళ్లు గంటకు పైగా అలస్యంగా నడిచాయి. గూడూరు మీదుగా రాకపోకలు సాగించే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా ఆలస్యంగా నడిచాయి.