పాఠశాలలో డీఈవో ఆకస్మిక తనిఖీ

బజార్‌ హత్నుర్‌: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖాధికారి ఆక్రముల్లా ఖాన్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల గైర్హాజరు, పదో తరగతి పాఠ్యాంశాల బోధన సరిగా లేదని మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై డీఈవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత పాఠశాల పనితీరును మెరుగుపరచకపోతే చర్యలు తప్పవని ఉపాధ్యాయులకు సూచించారు.