పాఠశాలలో శారీరక పరీక్షలు

గోదావరి ఖని: జ్యోతినగర్‌లోని దుర్గయ్య పల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు శారీరక ద్రుఢత్వం పై పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెలా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రామగుండం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ పరీక్షలు నిర్వహించారు. మండల విద్యాధికారి మధుసూదనరావు, డా.క్రాంతిగౌడ్‌ ఈ కార్యక్రమానికి హాజరై పరీక్షలు నిర్వహించారు.