పాఠశాలల్లో తల్లిదండ్రులు

 

 

 

 

 

 

 

-ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం…-పాఠశాల హెడ్ మాస్టర్ రేవతి..గద్వాల ప్రతినిధి మార్చి18 (జనంసాక్షి):- ధరూర్ మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (హరిజన్ చెర్రీ) హెడ్ మాస్టర్ రేవతి అధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం శనివారం నిర్వహించారు.. ఈ సందర్భంగా హెచ్.ఎం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రభుత్వం యోచిస్తున్నదని, ఇందుకోసం స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఎస్‌,ఎం,సీ)తో పాటు తల్లిదండ్రులు,ఉపాధ్యాయ సమావేశాలు నిర్వహిస్తుదని పాఠశాల హెచ్ఎం రేవతి సమావేశంలో తెలిపారు…పురోగతి,హాజరు, పిల్లల ప్రవర్తన,చదువుల మూల్యాంకనం ఇతర అంశాలను తల్లిదండ్రులు నేరుగా ఉపాధ్యాయులతో చర్చించారు..పిల్లల చదువు, పరీక్షా ఫలితాలు తెలుసుకోవడంతోపాటు మధ్యాహ్న భోజనం అమలు తీరును తల్లిదండ్రులు స్వయంగా పర్యవేక్షించవచ్చని, దీంతో నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని హెచ్,ఎం విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.. ఈ సమావేశం ఎస్ఎంసి చైర్మన్ సుజాత, ఉపాధ్యాయులు కిషోర్ చంద్ర,నీలవతి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు..