పాఠశాలల్లో పాఠ్యాంశంగా క్రీడలు ఉండాలి: గగన్‌ నారంగ్‌

బుధవారం, ఆగస్టు 8: పాఠశాల స్థాయి నుంచే క్రీడలు ఓ పాఠ్యాంశంగా చేర్చాలని లండన్‌ ఒలింపిక్‌ కాంస్యపతక విజేత గగన్‌ నారంగ్‌ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన బుధవారం పూనెలో మాట్లాడుతూ మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని స్కూలు స్థాయి నుంచి పాఠ్వాంశాలను పెట్టాలని నారంగ్‌ సూచించారు.పిల్లలఅభివృద్దిలో క్రీడలు అత్యంత ముఖ్యమైనవన్నారు.అందువల్ల వీటిని పాఠశాల స్థాయినుంచే ఓక్రిడాంశంగాచేర్చాలనికోరారు.లండన్‌ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించినందుకు గన్‌ ఫర్‌గ్లోరీ అకాడామీని మహారాష్ట్ర క్రీడామంత్రి పద్మాకర్‌వాల్వీ సన్మానించారు.