పాఠశాల బస్సును ఢీకొన్న లారీ

15 మంది విద్యార్థులకు గాయాలు
ఖమ్మం : పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన ఖమ్మం గ్రామీణ మండలంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. వివేకానంద , స్వర్ణబారతి పాఠశాల విద్యార్ధులతో వెళ్తున్న బస్సును కరుణగిరి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీీకొంది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.