పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండ యాదగిరి

 ఎల్బీ నగర్( జనం సాక్షి  ) విధి నిర్వహణలో    పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని   బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండ యాదగిరి కొనియాడారు  .
వినాయక నిమజ్జన కార్యక్రమం లో పారిశుధ్య కార్మికుల పనితీరు చాలా గొప్పది, ప్రజల ఆరోగ్యం కోసం, ఎండనక వాననక కష్టపడుతుంటారని. వారి ప్రాణాలను లెక్కచేయకుండా కృషి చేస్తున్న  కార్మికులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు ….ఉదయం 4గంటల నుండి శానిటేషన్ సిబ్బంది  పరిసరాలను శుభ్రం చేస్తుంటారని, డ్రైనేజీలను రోడ్లన్నీ శుభ్రం చేయడం వల్లనే ప్రజలకు  ఏలాంటి రోగాలు వ్యాధులు రావడం లేదని అన్నారు  ,   కార్మికులందరూ  కష్టపడి పని చేయడం వల్లనే ఎల్ బి నగర్ మున్సిపాలిటీకి మంచి పేరు వస్తుందని తెలిపారు . పారిశుద్ధ్య కార్మికులకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండ యాదగిరి అధ్వర్యంలో డిఈ వెంకటేష్ ని, శానిటేషన్ ఇన్స్పెక్టర్ గణేష్  ని, జవాన్ నరసింహ ని, సూపర్ వైజర్ శేఖర్ ని, సిబ్బంది రమేష్, శివ, లలిత, జాన్సి తదితరులను సన్మానించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో చంపాపెట్ డివిజన్ మాజీ వార్డ్ మెంబర్లు గౌని అనసూయ, గౌర శ్రీనివాస్, ఏరియా కమిటీ సభ్యులు గోపాల్ ముదిరాజ్, జగదీష్ గౌడ్, టీల్లు యాదవ్, నాయకులు చందు యాదవ్, శేఖర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..