పార్టీ ఆదేశిస్తే లోక్సభకు పోటీచేస్తాం : యనమల
రంగారెడ్డి: బీసీ డిక్లరేషన్ ప్రకారం వచ్చే ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేయనున్నట్లు తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలియజేశారు. పార్టీ ఆదేశిస్తే సీనియర్లమంతా లోక్సభకు పోటీ చేస్తామని ఆయన తెలియజేశారు. లోక్సభకు ఎవరెవరిని పంపాలనే దానిపై కసరత్తు జరగుతోందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులపై పార్టీ దృష్టి సారించినట్లు తెలియజేశారు. 40 శాతం యువతకు, 100 సీట్లు బీసీలకు కేటాయిస్తామని ఆయన వెల్లడించారు.