పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై సలహాలిచ్చాం

ఢిల్లీ: పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై అధినేత్ర సోనియాగాంధీకి సలహాలు ఇచ్చామని చిరంజీవి అన్నారు. పార్టీలో సమన్వయలోపం ఉన్న విషయం అధిష్ఠానం దృష్టికి తీసుకొచ్చానన్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీలో సోనియాతో సమావేశం అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం తనదని తాను చెప్పలేదని, సమష్టి విజయమని చెప్పానని చిరంజీవి తెలియజేశారు. కేంద్ర మంత్రి పదవి తనకు ప్రధానం కాదని, కార్యకర్తగా సేవలందిస్తానని, ఏ బాధ్యతలు ఇచ్చినా నిజాయతీగా పనిచేస్తానని చిరంజీవి  అన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉంటుందని తాను భావించడం లేదని చిరంజీవి అన్నారు.