పాల్వంచను గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దుతా

ఖమ్మం, జూలై 31: పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో కాలుష్యాన్ని నివారించి చెట్లను పెంచి అందమైన గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దుతానని ఆర్డీవో శ్యాంప్రసాద్‌ అన్నారు. బస్టాండ్‌ మూలమలపు వద్ద, పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న మ్యాన్‌హోల్‌, కూరగాయాల మార్కెట్లలో ఆస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజి, సి-కాలనీ గేటు నుంచి కొమరం భీం విగ్రహం వరకు పూడుకుపోయిన డ్రైనేజి కాల్వను శుభ్రం చేయిస్తానని అన్నారు. కెటిపిఎస్‌ఈ ఎలయ్యను పిలిచి పూడిపోయిన డ్రైనేజిని వెంటనే మరమ్మతులు చేయాలని, సి-గేట్‌ వద్ద నుంచి కొమరం భీం విగ్రహం వరకు, బిసిఎం రోడ్డులోని డివైడర్‌ మధ్య పూలమొక్కలను పెంచాల్సిన బాధ్యత కెటిపిఎస్‌కు అప్పగించారు. బస్టాండ్‌ సెంటర్‌ నుంచి రాజీవ్‌ గాంధీ కూరగాయాల మార్కెట్‌ వరకు సిసిరోడ్లుతో పాటు డ్రైనేజీలకు సంబంధించి ఎస్టిమేషన్‌ తయారు చేసి షార్ట్‌ టెండర్లను పిలిచి వెంటనే పనులు ప్రారంభించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.