కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే..
` మాజీ సీఎంపై ముఖ్యమంత్రి రేవంత్ భాష తీరు దారుణం
` హరీశ్‌రావు బబుల్ షూటర్ మాత్రమే
` మీడియాతొ చిట్‌చాట్‌లో కవిత వ్యాఖ్యలు
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే పాలమూరు ` రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టిన కేసీఆర్‌ను ఉరి తీయాంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ విూద సీఎం భాష సరికాదన్నారు. కేసీఆర్‌ను ఒకసారి ఉరితీయాలంటే రేవంత్ రెడ్డిని పదిసార్లు ఉరి తీయాలంటూ మండిపడ్డారు. శుక్రవారం విూడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కవిత మాట్లాడుతూ.. ఈ సమావేశాలకు కేసీఆర్ వచ్చి సమాధానాలు చెప్పకపోతే బీఆర్‌ఎస్ పని ఖతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాల్సిందే అని పట్టుబట్టారు. సభకు రాకుండా పిల్ల కాకుల విూద సభా సమయాన్ని వదలొద్దంటూ హితవుపలికారు. ఈ విషయంలో ఒక కూతురుగా తన రక్తం ఉడుకుతోందన్నారు. ఉద్యమకారుడిని ఉరితీయాలని అంటే రక్తం మరుగుతోందని చెప్పారు. శాసన మండలి వద్ద విూడియాతో ఆమె చిట్‌చాట్ నిర్వహించారు. నా రాజీనామా ఆమోదం కోరేందుకు మండలికి వచ్చాను. కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడి నోరు మూయించాలి. బీఆర్‌ఎస్ మనుగడ కొనసాగాలంటే ఆయన అసెంబ్లీకి రావాలి. నదీ జలాల అంశాన్ని పిల్లకాకుల విూద వదిలేయవద్దు. బీఆర్‌ఎస్‌లో బబుల్ షూటర్లకే డిప్యూటీ లోర్ లీడర్ పదవులు ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు. సొంత జిల్లా మహబూబ్ నగర్‌కు రేవంత్ తెచ్చిన ప్రాజెక్టులు ఎన్ని అని ప్రశ్నించారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి కవిత మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఒక బచ్చా అని అన్నారు. ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏం తెలుసు అంటూ హరీష్‌ను టాగంట్ చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ సభకు రాకపోతే హరీష్ రావే అన్నీ చూసుకోవడం సరికాదని.. కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పాలని కవిత వ్యాఖ్యలు చేశారు.
కవిత కేసీఆర్ వదిలిన బాణమే
` అందులో అనుమానం లేదు: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ వదిలిన బాణం కవిత అని ఆయన అభివర్ణించారు. కవిత కన్ఫ్యూజన్‌లో ఉండి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తోందని వ్యంగ్యంగా అన్నారు. కవిత ఏ పార్టీలో ఉందో స్పష్టం చేయాలంటూ మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తన తండ్రి విూద సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆమె.. హరీష్ రావు విూద చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు? అంటూ కవితను ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇక బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎం స్పందనపై కవిత శుక్రవారం కాస్తా ఘాటుగా స్పందించారు. దీనికి కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి అంటే గౌరవమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు ఏమన్నా అంటే కౌంటర్ ఇస్తానన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో విూడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మంత్రి పదవి కోసం తాను ఏ రోజు పాకులాడలేదని చెప్పారు. మంత్రి పదవి కావాలంటూ తాను ఎవరిని అడగలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవినే తాను త్యాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తనకు, తన తమ్మునికి మధ్య ఎటువంటి గొడవలు లేవని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీ గురువారం సాయంత్రం ప్రజాభవన్‌లో జలాలు ` నిజాలు అంశంపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీలోని సీనియర్లు పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్టాన్రికి రావాల్సిన నీటి వాటా.. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వల్లే తగ్గిదంటూ సీఎం రేవంత్ కాస్తా ఘాటుగా స్పందించారు. సీఎం చేసిన వ్యాఖ్యలపై కవిత మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.


