నేడు డీజీపీ ముందు బర్సే దేవా లొంగుబాటు

` మావోయిస్టు అగ్రనేతతో పలువురు మావోయిస్టులూ..
` నేడు అధికారికంగా ప్రకటించననున్న శివధర్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోయిస్టులతో కలిసి బర్సే దేవా లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా బర్సే బాధ్యతలు నిర్వర్తించారు. హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో దేవా కీలకంగా ఉన్నారు. మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను చూస్తున్నారు. హిడ్మా, బర్సే దేవా ఛత్తీస్‌గఢ్‌లో ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించారు. నిన్న తెలంగాణ ` ఛత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి బర్సే దేవా బృందాన్ని పోలీసులు తీసుకొచ్చారు. బర్సే లొంగుబాటు వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి శనివారం విూడియాకు వెల్లడిరచనున్నారు.


