పిట్టల్లా రాలిపోతున్న పేద ప్రాణాలు

రాష్ట్రం రోగాల ముసుగేసుకొంది..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పడకేసి పడుకొంది..సర్కారు ఎలా ఉందో సర్కారు ఆసుపత్రి కూడా అలాగే ఉంది..పేద ప్రజలు రోగాల దుప్పట్లో బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నరు..అయినా వారినెవరు పట్టించుకొన్న పాపాన పోలే దు..ఎక్కడో విదేశీ చలి వాతావరణంలో బతికే స్వైన్‌ఫ్లూ విమానా లలో ప్రయాణించి వచ్చిన వారివల్ల ఒకరికో, ఇద్దరికో సోకి కార్పో రేట్‌ ఆసుపత్రులలో చేరితే కార్పోరేట్‌ మీడియా గొంతెత్తి అరు స్తుంది..ప్రపంచం తగల బడి  పోతున్నట్లు వచ్చేసింది స్వైన్‌ఫ్లూ అం టూ అరిచి గగ్గోలు పెడుతుంది..ఇక్కడ బతకని స్వైన్‌ఫ్లూ పట్టుకొని విస్తృత ప్రచారం చేస్తుంది..అదే కార్పోరేట్‌ మీడియా శైలి..అది దేన్నైనా వ్యాపార కోణం నుంచే చూస్తోంది..దానికి విమానాలలో తిరగే విఐపిల ప్రాణాలే తప్ప సాదాసీదా జనం పట్టరు..గ్రామాల్లో దిక్కూ మొక్కూ లేకుండా పడి ఉండే జనం మీడియాకు పట్టదు.. అది వారిని మనుషులుగా చూడడం ఎపుడో మానేసింది..నిజానికి పల్లెలన్నీ పడకేసినయి..దుప్పట్లో వణికిపోతున్నయి…ఆదిలాబాద్‌ అడవుల నుంచి మెతుకుసీమ  మెదక్‌ దాకా… ఖమ్మం ఏజెన్సీ నుంచి పాలమూరు పాల పల్లె  దాకా.. నల్లమల అడవుల చెంచుగూడాల దాకా జనం పిట్టల్లా రాలుతున్నారు. ఒకసారి మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలు సోకి వందలు, వేలై జనం రాలిపోతున్నారు… అయితే ఏ ప్రభుత్వం, వైద్యులు వారిని చేరవు..ప్రభుత్వం పేరుకు ప్రకటించే వైద్య బృందాలు..మెడిసిన్‌లు ఏవీ వారిదాకా రావు..ప్రతి ఏటా ఇది జరిగే తంతే అయినా..ప్రభుత్వం వారి సంక్షేమాన్ని పట్టిం చుకోలేదు…వారికి వైద్యం చేయించడానికి నామమాత్రంగా నిధులు విడుదల చేసే ప్రభుత్వం అవి వారికి చేరుతున్నాయా లేవా అంటూ పట్టించుకోదు.. దిక్కూ మొక్కూ లేకుండా పడున్న ప్రజలంటే ప్రభుత్వానికి కూడా లోకువే..ప్రభుత్వాసుపత్రులకు రోగమొచ్చిం ది..అక్కడ సెలైన్‌ బాటిల్‌ లేదు..మందులు లేవు…డాక్టర్లు లేరు.. ఉన్నా పట్టించుకోరు…వారు డబ్బాశతో ఇంకెకడో ప్రైవేటు క్లినిక్‌లు పెట్టుకొంటారు..ఇక కార్పోరేట్‌ ఆసుపత్రుల సంగతి చెప్ప నవసరం లేదు..అక్కడకిి వెళ్లిన వారికి దగ్గురోగం అయితే వైద్యులకు డబ్బు రోగం.. వైద్యో నారాయణ హరీ అని పెద్దలు చెప్పారు.. అయితే ఈ వైద్యులు చేసే మాయాజాలానికి ఆనారాయణుడు కూడా హరీ అన డం ఖాయమని మనం చెప్పకోవాలి..ఎందుకన్నడో తెలియదు కానీ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ వైద్యులను లైసెన్స్‌ కిల్లర్‌ అన్నడు. దాంతో వైద్యులు గగ్గోలెత్తిపోయారు..ఆ డబ్బు కూపం నుంచి తోటి డాక్టర్‌లను బయటకు తీసుకురావడం గురించి ఆలోచించని వైద్యు లు లేని పరువు గురించి ఆలోచిస్తూ పరువు నష్టం దావా వేశారు.. జనం పిట్టల్లా రాలుతుంటే ఈ ప్రభుత్వానికి పట్టదు..ఈ ప్రభు త్వాలకు పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే సమయం ఎక్కడిది..కనీస సౌకర్యాలు లేక ఎంజీఎం, నీలోఫర్‌ ఆసుపత్రులలో పుటపుటా రాలిపోతున్నరు..సిబ్బంది కొరతతో పిల్లల్ని చంపడంలో అవి రెండూ పోటీ పడుతున్నయి..ఒక ఆ రెండు ఆసుపత్రులే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ ఆసుపత్రులలో పరిస్థితి అలాగే ఉంది…అంతే కాదు..ప్రపంచ బ్యాంకు సహకారంతో ని ర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బతికుంటే ఫ్యామిలీ ప్లానింగ్‌, చస్తే పోస్ట్‌ మార్టమ్‌ అన్న చందంగా మారిపోయాయి..కార్పోరేట్‌ ఆసుపత్రులు దోచుకొనేందుకు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీగా మారింది..దీంతో ప్రజలకు జరిగే మేలేం లేదు..అది అన్ని రోగాలకు వర్తించదు..దాంట్లోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి.. . ప్రజల ఆరోగ్యాన్ని కాపా డేందుకు ఏర్పాటు చేసిన పథకంలోలనూ నియమ నిబంధనలు పెట్టడంతో పేద ప్రజలకు మేలు జరగడం లేదు..ప్రజల ప్రాణాలను కూడా ప్రభుత్వం, పాలకులు తమ కుటుంబ సభ్యుల  ప్రాణాల లాగా చూసుకుంటే తప్ప, సర్కారీ ఆసు పత్రులలో అన్ని సౌకర్యాలె కల్పిస్తే తప్ప కార్పోరేట్‌ కబంద హస్తాల నుండి పేద ప్రజలకు ప్రజావైద్యం అందదు.. వైద్యం తిరిగి ప్రజల చెంతకు చేరదు..