త్వరలో భారత్‌కు అధునాతన జావెలిన్‌ క్షిపణి వ్యవస్థ

` అమెరికాతో కుదిరిన 93 మిలియన్‌ డాలర్ల ఆయుధ ఒప్పందం
వాషింగ్టన్‌(జనంసాక్షి): భారత్‌`అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. దీంతో అధునాతన జావెలిన్‌ క్షిపణి వ్యవస్థ మన దేశానికి అందనుంది. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు వరంలా వచ్చిన ఈ ఆయుధానికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉంది. భుజం విూద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ మిసైల్‌.. కొన్ని వందల సంఖ్యలో రష్యన్‌ ట్యాంకులను పేల్చేసింది. ఈ క్రమంలో అమెరికాతో 93 మిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను భారత్‌కు విక్రయించేందుకు అగ్రరాజ్యం ఆమోదించింది. జావెలిన్‌ ట్యాంక్‌ విధ్వంసకర క్షిపణిని భుజంపై నుంచి శత్రు ట్యాంకుల పైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు. దీనిలో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్‌ లాంఛ్‌ ట్యూబ్‌, కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఉంటాయి. వాస్తవానికి ట్యాంక్‌ విధ్వంసకర ఆయుధాన్ని ప్రయోగించిన ప్రదేశం నుంచి పొగ, వేడి వెలువడతాయి. ప్రత్యర్థులు హీట్‌ సెన్సర్లతో వాటిని గుర్తిస్తారు. కానీ, జావెలిన్‌లో తొలుత ట్యూబ్‌ నుంచి ఓ మోటర్‌ క్షిపణిని బయటకు కొంతదూరం విసురుతుంది. ఆ తర్వాత క్షిపణి మోటార్‌ పనిచేయడం మొదలుపెట్టి లక్ష్యం వైపు దూసుకెళుతుంది. దీనిని కంప్యూటర్‌తో నియంత్రిస్తారు. దీంతో కచ్చితంగా జావెలిన్‌ను ఎక్కడినుంచి ప్రయోగించారో శత్రువుకు అర్థం కాదు. ఈ లోపు ప్రయోగించిన వారు సురక్షిత ప్రదేశంలో దాక్కోవచ్చు. రీయాక్టివ్‌ ఆర్మర్‌ రక్షణ కవచాలను ఛేదించి.. ట్యాంకును ధ్వంసం చేసేలా దీనిలో రెండు దశల్లో పేలుడు పదార్థాలను అమర్చారు. తొలిదశలో కవచాన్ని ఛేదించి.. ఆ తర్వాత దశలో వార్‌హెడ్‌ ట్యాంక్‌ను ధ్వంసం చేస్తుంది. వీటిని అమెరికాకు చెందిన రక్షణరంగ దిగ్గజాలు రేథియాన్‌, లాక్‌హీడ్‌ మార్టీన్‌ సంస్థలు అభివృద్ధి చేశాయి. వీటి ఉత్పత్తి చాలా క్లిష్టమైన, ఖరీదైన వ్యవహారం. వీటి ధర 2 లక్షల డాలర్ల వరకూ ఉంటుందని అంచనా.రష్యాతో పోరులో ఉక్రెయిన్‌ ఈ క్షిపణులను విపరీతంగా వినియోగించింది. మాస్కోకు చెందిన పలు యుద్ధ ట్యాంకులను పేల్చేసింది. వీటి నుంచి తప్పించుకోవడం కోసం రష్యా తమ ట్యాంకులపై లోహపు బోన్లను అమర్చిందంటే.. వీటి సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. మొత్తం 93 మిలియన్‌ డాలర్ల ఆయుధాలను విక్రయించేందుకు భారత్‌`అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో 45.7 మిలియన్‌ డాలర్ల విలువైన జావెలిన్‌ మిసైల్‌ వ్యవస్థలు, సంబంధిత హార్డ్‌వేర్‌ను అగ్రరాజ్యం అందించనుంది. దీంతోపాటు 47.1 మిలియన్‌ డాలర్ల విలువైన ఎక్స్‌కాలిబర్‌ ప్రొజెª`టకైల్స్‌, ఇతర సైనిక పరికరాలను విక్రయించనుంది. తొలివిడతలో భాగంగా జావెలిన్‌ ఎఫ్‌జీఎం`148 మిసైల్స్‌, 25 జావెలిన్‌ లైట్‌వెయిట్‌ కమాండ్‌ లాంఛ్‌ యూనిట్స్‌ వంటి వాటిని భారత్‌కు అందించనుంది.