భార్య, పిల్లల్ని హత్య కేసులో.. నిందితుడికి ఉరిశిక్ష
` సంచలన తీర్పు వెలువరించిన వికారాబాద్ జిల్లా కోర్టు
వికారాబాద్(జనంసాక్షి): భార్య, పిల్లల్ని హత్య చేసిన కేసులో వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసింది. వికారాబాద్ జిల్లాలో 2019లో ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అయితే, ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో జిల్లా కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది.


