చెకుముకి పోటీల్లో జీనియస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

 

 

 

 

 

సదాశివపేట నవంబర్21(జనం సాక్షి)మండల స్థాయి చెకుముకి పోటీల్లో జీనియస్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. శుక్రవారం మండల స్థాయి చెకుముకి పోటీలను పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ లో నిర్వహించారు. పోటీల్లో జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ విద్యార్థులు రోషన్ రెడ్డి, తహేరా యూసుఫ్, ఖాజా మొయినుద్దీన్ లు ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. సదాశివపేట పట్టణ మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ లో ప్రథమ స్థాయి విజేతలుగా నిలిచిన జీనియస్ స్కూల్ విద్యార్థులకు మండల విద్యాధికారి శంకర్ అభినందించి ప్రశంసా పత్రాలు , బహుమతులు అందజేశారు.