సీనియర్ మేట్లను అసిస్టెంట్లుగా గుర్తించాలని

మునిపల్లి, నవంబర్ 21( జనం సాక్షి)
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింలు
ఉపాధి హామీ లో పనిచేస్తున్న సీనియర్ మేట్లను అసిస్టెంట్లుగా గుర్తించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన మునిపల్లి లో
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మునిపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ… మహాత్మా గాంధీ ఉపాధి హామీలు పనిచేస్తున్న సీనియర్ మేట్లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాలని కోరారు. ప్రత్యేక అధికారుల పాలనలో ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు మంచినీటి సమస్య పరిష్కరించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రెండు,మూడు సంవత్సరాల నుండి పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్న కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని,ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు ప్రతి నెల మొదటి వారంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని,ఉపాధి హామీని సక్రమంగా నడిపించాలని అన్నారు. ఈ కేవైసీ పేరుతో అనేకమంది కూలీ


