కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

వేములవాడ రూరల్, నవంబర్ 20(జనంసాక్షి):
అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సూచించారు. వేములవాడ రూరల్ మండలం అచ్చన్న పల్లి, వెంకటాంపల్లి, నమిలిగుండుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దళారులకు అడ్డుకట్ట వేసేందుకు, రైతులకు మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంబించామని వెల్లడించారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2389, కామన్ రకానికి రూ.2369 నిర్ణయించిదని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులకు ధాన్యం విక్రయించవద్దని కోరారు.


