హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము
బేగంపేట(జనంసాక్షి): భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హైదరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు ఉన్నారు.



