పి ఈ టి ఏ జిల్లా అధ్యక్షులుగా దేవత ప్రభాకర్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 22 (జనంసాక్షి). పి ఈ టి ఏ జిల్లా అధ్యక్షులుగా దేవత ప్రభాకర్ ఎన్నికయ్యారు. మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులుగా దేవత ప్రభాకర్, జనరల్ సెక్రెటరీగా తడుకల సురేష్ పలువురు కార్యవర్గ సభ్యులుగా నియామకం అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీగా బుచ్చిరెడ్డి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని డీఈవో దనలకోట రాధా కిషన్ తోపాటు పి ఈ టి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపత్ రావు, రవీందర్ రావు, మాజీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ రవికుమార్ పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు, అభినందనలు తెలిపారు.

తాజావార్తలు