పుట్టి పెరిగిన ఊరు పై మమకారం “నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ హాస్పిటల్” ఏర్పాటు కు శ్రీకారం

 

 

 

 

 

 

ఈనెల 17న హాస్పటల్ ప్రారంభోత్సవం.. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావుల రాక….
జనం సాక్షి, మిర్యాలగూడ

ఊరిపై ఉన్న మమకారంతో తను పుట్టి పెరిగిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నూకల వెంకట్ రెడ్డి తను తన కుటుంబం బాగుండడమే కాదు తన గ్రామంలో ఉన్న నిరుపేద ప్రజల కోసం, ఆ ప్రజలకు విద్యను, వైద్యాన్ని అందించాలని సంకల్పంతో “నూకల వెంకటరెడ్డి చారిటబుల్ ట్రస్ట్’ ను ఏర్పాటు చేసి తద్వారా ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. 25 లక్షల విలువగల విశాలమైన స్థలంలో 50 లక్షల రూపాయలతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు.15 లక్షలతో ఆసుపత్రి కావాల్సినటువంటి సకల వసతులను, ఆధునిక పరికరాలతో కూడిన ల్యాబ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో నిరంతరం 10 గంటలు అందుబాటులో అనుభవం కలిగిన డాక్టర్ ఉండడంతో పాటు కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిసర ప్రజలకు ఉచిత ఓపితో వైద్యాన్ని అందించనున్నారు. ఆసుపత్రిలో ఒక సీనియర్ డాక్టర్, ఇద్దరూ నర్సింగ్ స్టాఫ్, ఒక్కరు ల్యాబ్ టెక్నీషియన్, ఒకరు ఫార్మసిస్ట్, ఆస్పత్రిని శుభ్రపరచేందుకు ఒక క్లీనర్ను నియమించారు.నూకల వెంకట్ రెడ్డి ట్రస్టుకు ఆసుపత్రి ఏర్పాటు చేసినందుకు ప్రతి నెల రెండు లక్షల రూపాయలు ఖర్చును ట్రస్టు ద్వారా భరించనున్నట్లు పేర్కొన్నారు. నూకల వెంకట్ రెడ్డికి ఊరి పై ఉన్న మమకారానికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.
సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి కుటుంబం విద్యకు వైద్యానికే ఎక్కువగా ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే.. కొత్తగూడెం గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం నూకల వెంకట్ రెడ్డి రూపంలో వారి వైద్యానికి సంబంధించిన ఖర్చులన్నీ వారే భరించి ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అనేది వారి చేతికి వెన్నెముక లేదు అనడానికి నిదర్శనం వారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా ప్రజలు భావిస్తున్నారు. తాను పుట్టి పెరిగిన స్వగ్రామైన కొత్తగూడెం గ్రామానికి తొలినుంచి ఏదో ఒక రూపంలో తన వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న వెంకటరెడ్డి పేద ప్రజలకు వైద్యం అందుబాటులో తీసుకురావాలని ఆస్పత్రి ఏర్పాటు చేయడం ప్రశంసనీయం అని పలువురు పేర్కొంటున్నారు. కొత్తగూడెం గ్రామంలో నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ హాస్పటల్ ను,
ఈ నెల 17న ఉదయం 9- 45 నిమిషాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతుభాస్కరరావులు ప్రారంభించనున్నట్లు ట్రస్ట్, నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా, డివిజన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, హాజరుకానున్నారని వారు పేర్కొన్నారు.