పులుల సంరక్షణ కేంద్రాల్లో పర్యాటనం వద్దు: సుప్రీంకోర్టు

ఢిల్లీ: పులుల సంరక్షణకు కృషి చేస్తున్న వారికిది శుభవార్తే పులుల సంరక్షణ కేంద్రాల్లోకి పర్యాటకులను అనుమతించవద్దని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. సంరక్షణ కేంద్రాల్లోకి పార్యటకులను అనుమతించడం వల్ల వాటి పరిసరాల్లో సహజత్వం లోపిస్తోందని, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తాజా గణాంకాల ప్రకారం మన దేశంలో 1700 మాత్రమే పులులు మిగిలినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టైగర్‌ సఫారీలు, రిసార్టుల్లాంటివి బఫర్‌జోన్లలో ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పులుల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో బఫర్‌ జోన్లపై నోటిఫికేషన్‌ ఇస్తూ ఆఫిటవిట్‌ జారీ చేయని రాష్ట్రప్రభుత్వాలకుె న్యాయస్థానం రూ. 10వేల జరిమాన విధించింది.