పృథీ¸్వ – 2 ప్రయోగం విజయవంతం

పృథీ¸్వ – 2 ప్రయోగం విజయవంతం
ఒడిశా, అక్టోబర్‌ 4 (ఆర్‌ఎన్‌ఏ):క్షిపణుల రూపకల్పన, ప్రయోగాల్లో భారత్‌ మరోమారు తన సత్తాచాటింది. ప్రతిష్టాత్మక క్షిపణి పృథ్వీ-2 ప్రయోగం విజయవంతమమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో గురువారం ఉదయం 9 గంటలకు ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. అణ్వస్త్రాలను మోసుకెళ్లగల ఈ క్షిపణి 350 కిలోవిూటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వి-2 ఉపరితలం నుంచి ఉపరితలం విూది లక్ష్యాలను వ్యూహాత్మకంగా ఛేదంచగల ఈ క్షిపణిని భారత్‌ డిసెంబర్‌ 22, 2010న తొలిసారి విజయవంతంగా ప్రయోగించింది. గురువారం చాందీపూర్‌లో ప్రయోగించిన మొబైల్‌ లాంచర్‌ నుంచి పృథ్వి-2 పరీక్ష ప్రయోగం విజయవంతమైందని రక్షణ వర్గాలు ప్రకటించాయి. క్షిపణి లక్ష్యాన్ని ఛేదించిందని ఐటీఆర్‌ డైరెక్టర్‌ ఎంవీకేవీ ప్రసాద్‌ తెలిపారు. సైన్యానికి క్షిపణి నియంత్రణ వ్యవస్థపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇచ్చేందుకే ఈ ప్రయోగం నిర్వహించినట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిసైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఐజీఎంపీడీ)లో శ్రీుఁత్హా 3| పేఓ్లో