పృధ్వీ -2 ను పరీక్షించిన రక్షణశాఖ
ఒడిశా: ఒడిశాలోని బాలాసోర్ నుంచి పృధ్వీ -2ను రక్షణశాఖ ఈ రోజు పరీక్షించింది. 350 కిలోమీటర్ల మేర అణ్వాయుధాలను పృధ్వీ-2 క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను చేధించగలదు. చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లాంచ్ కాంప్లెక్స్ -3 నుంచి దీనిని ప్రయోగించారు.



