పెద్దపల్లిలో జోరుగా కిరాణ వర్తకుల దొంగ వ్యాపారం

ఎ గుమస్తాలను పావులుగా వాడుకుంటున్న వైనం

ఎ హైదరాబాద్‌ నుంచి సరుకుల దిగుమతి

ఎ పట్టించుకోని అధికారులు

ఎ దొరికాక జరిమానాలతో బయటపడుతున్న వైనం

పెద్దపల్లి, జూన్‌ 5 (జనంసాక్షి) : పట్టణంలో కిరాణ వర్తకుల దొంగ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. దొరికితే దొంగ లేదంటే దొరలా వ్యవహ రిస్తున్నారు పెద్దపల్లి కిరాణ వర్తక వ్యాపారులు. ఇటీవల కిరాణ వర్తక వ్యాపా రులు లాభాలు త్వరగా సంపాదించాలని అడ్డదారులు తొక్కుతున్నారు. హైద రాబాద్‌లోని కొందరు కాస్మొటిక్‌ వ్యాపారుల వద్ద పెద్దపల్లి కిరాణ వర్తక వ్యాపారులు సామాను కొనుగోలు చేస్తుంటారు. వాటి అమ్మకం కొనుగోళ్ల విషయంలో మొత్తం వ్యవహారం గుమస్తాల మీదనే ఆధారపడి వ్యాపారం కొనసాగిస్తారు. దీన్ని మన కిరాణ వర్తక వ్యాపారులు ఆసారగా తీసుకుని గుమాస్తాలను మచ్చిక చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌ లోని బేగంబజార్‌లో కిశోర్‌ కాస్మొటిక్‌ అనే హోల్‌సెల్‌ షాపు వున్నది. అందులో పని చేస్తున్న గుమాస్తాలు కొన్ని నెలల క్రితం అందులో నుంచి వెళ్లి పోయారు. ఆ యజమాని గోదాముల తాళాలు డమ్మివి తయారు చేసుకుని ఆ గుమాస్తా దగ్గర వుంచుకున్నాడు. తదుపరి ఆ గుమాస్తా పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, కాగజ్‌నగర్‌లోని కిరాణ వర్తక వ్యాపారుల దగ్గరకు వెళ్లి నేను వేరే షాపు పెట్టుకున్నాని వారికి భారీగా డిస్కౌంట్లు చూపించి వారికి హైదరాబాద్‌ నుంచి స్టాక్‌ వేసి డబ్బులు తీసుక పోతున్నాడు. ఇంత వరకు బాగానే వుంది. ఆ గుమాస్తా కిరాణ వర్తకులకు ఇచ్చే స్టాక్‌ మొత్తం వారు ఇంతకు ముందు పనిచేసే యజమాని కిశోర్‌ కాస్మొటిక్‌ యొక్క గోదాము నుంచి దొంగ తాళాలతో సామాను తరలిస్తు న్నారని వారికి తెలియదు.

ఇలా ఆ దొంగ గుమస్తా మొత్తం వ్యాపారం 20 నుంచి 25లక్షలు చేసాడని హైద్రాబాద్‌ నుంచి వచ్చిన అప్జల్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై రవి మా ప్రతినిదికి తెలియజేశారు. పెద్దపల్లిలోని నలుగురు వ్యాపారులు అతడి వద్ద సామాను కొనుగోలు చేశారని ఆతడి సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి వారిని విచారించి వారి నుంచి డబ్బులు రాబట్టడానికి వచ్చామని తెలిపారు. దీన్ని గమనించిన కిరాణ వర్తక వ్యపారులు అందరు పోగై వచ్చిన పోలీసు అధికారులతో మంతనాలు జరపడం మొదలు పెట్టారు.తీరా విషయం మీడియా వారికి తెలియడంతో పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి నలుగురు కొన్న సరుకుల విలువ 220000 ఉండగా దానికి రెండు నెలల క్రితం ఆ గుమాస్తాకు డబ్బులు ఇచ్చారు. అది దొంగ సరుకుగా తెలియడంతో మళ్లీ అందరు కలిసి 120000 రూపాయలు వచ్చిన పోలీసులకు ఇచ్చారని హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. లేదంటే వారిని రిమాండ్‌కు పంపుతామని తెలుపడంతో భయంతో ఆ డబ్బులు వ్యాపారులు చెల్లించారు. ఇదంతా హైదరాబాద్‌ పోలీసులు వచ్చిన క్షణాలలో జరిగిందని పట్టణ ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయమై మా ప్రతినిధి వర్తక సంఘం అధ్యక్షుడిని వివరణ కోరగా. దొంగ సామాను కొన్న కిరాణ వర్తక వ్యాపారులకే వత్తాసు పలికాడు.హైద్రాబాద్‌ కిశోర్‌ కాస్మొటిక్‌లో పని చేసి వెళ్లి దొంగ తాళాల ద్వారా గోదాముల నుంచి వ్యాపారం చేస్తున్న వారి పేర్లు ముఖేశ్‌, భగవాన్‌ రావు అని తెలిపారు. వారిలో ఒకరిని పెద్దపల్లి వచ్చిన సుమోలో అరెస్ట్‌ చేసి తీసుకుని వచ్చారు. ఏది ఏమైనా పెద్దపల్లి వ్యాపారుల దొంగ వ్యాపారాలపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వీరు ఎన్ని దొంగ వ్యాపారాలు చేస్తున్నారో అని పట్టణ ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దొంగ సరుకులు కొనుగోలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

(బొల్లం వేణు)