పెనుబల్లి మండల బీజేపీ బీసీ మోర్చా అధ్యక్షులు బి ఆర్ యస్ పార్టీ లో చేరిక

 

 

 

 

 

పెనుబల్లి, మార్చ్15 (జనం సాక్షి)
గత 5సంవత్సరాల నుండి బీజేపీ బీసీ మోర్చా పెనుబల్లి మండల
అధ్యక్షులు,పెనుబల్లి మండల వడ్డెర సంఘం అధ్యక్షులు గంగదేవిపాడు గ్రామ నివాసి వల్లెపు రాధాకృష్ణ బుదవారం గంగాదేవి పాడులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య సమక్షం లో కనగాల వెంకటరావు ఆధ్వర్యంలో 8 కుటుంబాలు 30 మందితో బి ఆర్ యస్ పార్టీ లో చేరడం జరిగింది, నిత్యం ప్రజలలో ఉంటూ,ప్రజల బాధలను గుర్తించి వెంటనే పరిష్కరించే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వెంట వుండాలనే ఆశయంతో పార్టీలో చేరామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే సి ఆర్ అభివృద్ధి ,సంక్షేమ పథకాలను చూసి అభివృద్ధి వైపు మనం ఉండాలని ,బి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కే టి ఆర్ పార్టీని నడిపించే క్రమశిక్షణ విధానానికి ఆకర్షితులై పార్టీ లో చేరినట్టు తెలిపారు.