పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేత

క్యాతన పల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణాపూర్ పోస్ట్ ఆఫీస్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారికి బయోమెట్రిక్ మిషన్ ద్వారా ప్రస్తుతం పెన్షన్స్ అందజేస్తున్నారు. ఎక్కువమంది పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఉండడంతో రెండు మిషన్స్ సరిపోవడంలేదని ఒకటో వార్డు కౌన్సిలర్ పోగుల మల్లయ్య, రెండో వార్డ్ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ లు పెన్షనర్స్ సులువుగా పెన్షన్ తీసుకోవడం కోసం డి ఆర్ డి ఏ పి డి శేషాద్రి కి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోస్టల్ సూపర్డెంట్ కి ఫోన్లో సమాచారమందించారు. వచ్చే నెల నుంచి ఇంకా రెండు బయోమెట్రిక్ మిషన్స్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. వెంటనే ఎస్పీ స్పందించి ఏర్పాటు చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా వీరు ఇరువురు పోస్టల్ సూపరిండెంట్ కు పోస్టు ద్వారా విన్నపం లెటర్ పంపించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, పుల్లూరి సుధాకర్ లు మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆశీస్సులతో ప్రజల కోసం పనిచేస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు, రెండోవార్డ్ టిఆర్ఎస్ నాయకులు ఓదెల సతీష్, సతీష్ యాదవ్ పాల్గొన్నారు.