ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అమెరికా `భారత్‌లు కలిసి పనిచేస్తూనే ఉంటాయి

` ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
` ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు వెల్లడి
న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించినట్లు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు మోదీ ట్వీట్‌ చేశారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. పుతిన్‌ భారత పర్యటన అనంతరం ట్రంప్‌-మోదీ సంభాషించుకోవడం ఇదే తొలిసారి.మరోవైపు, ఎన్డీయే పక్ష ఎంపీలకు ప్రధాని మోదీ తన నివాసంలో గురువారం సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. 7లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ఉన్న మోదీ నివాసానికి ఎంపీలు బృందాల వారీగా బస్సుల్లో వెళ్లారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం. బిహార్‌కు చెందిన ఎన్డీయే నేతలు గత సోమవారం ప్రధాని మోదీని కలిసి సత్కరించిన విషయం తెలిసిందే.