ఆంధ్రా అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం
` పోలవరం`నల్లమల్ల సాగర్ లింకు మేమొప్పుకోం
` సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని తెలంగాణ నిర్ణయం
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం నల్లమల్ల సాగర్ పై ఏపీ ప్రాజెక్ట్ కు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టులో వాదనలకు సర్కార్ సిద్ధం అవుతోంది. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఫ్వీుకి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. నేడు పోలవరం బనకచర్ల కేసుపై ఢల్లీిలోని తెలంగాణ భవన్ లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. ఢల్లీిలో సంఫ్వీుతో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు.నేడు పోలవరం-బనకచర్ల సుప్రీంకోర్టు కేసుపై ఢల్లీిలోని తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 12 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అభిషేక్ మను సింఘ్వితో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమవుతారు. ఏపీ సర్కార్ తలపెట్టిన ప్రాజెక్ట్ పై లోతుగా చర్చించనున్నారు. ఆపై న్యాయపోరాటానికి దిగే అవకాశం ఉంది.ఇక ఇటీవలనే పోలవరం – నలమల సాగర్ డీపీఆర్ రూపకల్పన కోసం టెండర్లను పిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నల్లమలసాగర్ లిం?క్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అన్ని ఆధారాలతో సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని తెలంగాణ సర్కార్ చూస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను త్వరలోనే మొదలు పెట్టాలని ఇటీవలే సీఎం చంద్రబాబు కూడా అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి వరద జలాలను బొల్లాపల్లి, నల్లమల సాగర్‌లకు, అలాగే, నాగార్జున సాగర్ నుంచి 50 టీఎంసీల కృష్ణా వరద జలాలను బొల్లాపల్లికి తరలించే యోచన చేయాలని సూచించారు. ముందుగా ప్రతిపాదించిన గోదావరి – బనకచర్ల ప్రాజెక్ట్ ను మొత్తం రూ.80,112 కోట్లతో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం జల హారతి కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్ట్ ను మొత్తం 3 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలోకి%ౌ%. అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌లోకి తీసుకోనుంది. అక్కడ్నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించాలనేది ఏపీ సర్కార్ ప్లాన్. వీటి కోసమే టెండర్లను ఆహ్వానించింది. కానీ పలువైపుల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో వెనక్కి తగ్గింది. పోలవరం నుంచి వరద జలాల తరలింపును బనకచర్ల వరకు కాకుండా మధ్యలో నల్లమల సాగర్ వరకే పరిమితం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టుతో పోల్చితే%ౌ% ఈ కొత్త అనుసంధానంతో భారీగా వ్యయం తగ్గే అవకాశం ఉంది.



