పంచాయతీ పోరులో ప్రజాపాలనవైపే ప్రజలు
` ఈశ్వరాచారి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం..
` ఆత్మహత్యలు చేసుకోవద్దు.. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం
` రూ.5లక్షల నష్టపరిహారం చెక్‌ను కుటుంబానికి అందజేసిన మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం
హైదరాబాద్(జనంసాక్షి):బిసి రిజర్వేషన్లు కోసం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. ఎవ్వరు అధర్యపడొద్దని, బిసి రిజర్వేషన్లు సాదించుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జగద్గిరిగుట్టలోని ఈశ్వరచారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్ ను అందజేశారు. దీనితోపాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పారు. బిసి సమాజం రిజర్వేషన్లు సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఆయన కోరారు. ఈశ్వరచారి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమని, ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోవద్దని, ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని అన్నారు. కార్యక్రమంలో బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్, టీపీసీసీ సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్ డా.వినయ్, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, నూతి శ్రీకాంత్, మెట్టు సాయి, బిసి సంఘం నాయకులు గణేష్ చారి తదితరులు పాల్గొన్నారు.


